- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sama Ram Mohan Reddy: కవిత బెయిల్ పై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెర వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఎన్నికలప్పుడే డ్రామాలు ఆడతారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. కవిత విడుదల పై స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన ఆయన బీజేపీ, బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగంగా కవిత అరెస్ట్ జరిగిందే తప్ప.. బీజేపీ, బీఆర్ఎస్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోలేదు, తీసుకోబోదని తెలిపారు. గత పదేళ్లుగా రాష్ట్ర వనరులను కొల్లగొట్టిన బీఆర్ఎస్ నాయకుల మీద బీజేపీ ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కానీ ఎన్నికలప్పుడు ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ చేసిన అక్రమాలు తన టేబుల్ మీద ఉన్నాయని.. ఇదో పెద్ద అవినీతి కుటుంబమని, దేశ రాజకీయాలకే డబ్బు పంపించేంత అవినీతి చేసిందని చెప్పినట్లు గుర్తు చేశారు.
అయినా బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోదని, ఎందుకంటే తెర వెనుక బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒక్కటేనని, ఈ రెండింటికీ కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నికలప్పుడే ఈ డ్రామాలు ఆడతారని విమర్శించారు. కవిత బెయిల్ మీద బయటకి వస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాబోతున్నాయని మొన్ననే రేవంత్ రెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే గత పాలనలో అవినీతి చేసిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి అక్రమాలపై కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఊచలు లెక్కబెట్టాల్సిన అవసరం ఉందని, ఊచలు లెక్కబెట్టబోతున్నారన్న నమ్మకం కూడా ఉందని, ఈ విచారణలను అడ్డుకునే కృషి బీబేపీ కచ్చితంగా చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా చేయకుంటే బీజేపీ వద్ద ఉన్న ఆధారాలతో బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.