Sama: బాప్ ఏక్ నంబరి బెటా దస్ నంబరీ.. కేటీఆర్ పై సామా రామ్మోహన్ ఫైర్

by Ramesh Goud |
Sama: బాప్ ఏక్ నంబరి బెటా దస్ నంబరీ.. కేటీఆర్ పై సామా రామ్మోహన్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంటారు. ప్రత్యర్ధులు చేసిన విమర్శలకు ట్విట్టర్(Twitter) వేదికగా కౌంటర్లు(Counters) ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTRBRS) చేసిన వ్యాఖ్యలకు రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్(Medicover) పై కేటీఆర్ చేసిన ఆరోపణల పట్ల ఆసుపత్రి యాజమాన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చిన వీడియోను పోస్ట్ చేశారు.

దీనిపై అబద్దాలలో బాప్ ఏక్ నంబరి బెటా దస్ నంబరీ అని, అబద్దాలతో మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేటీఆర్ చేసిన ఆరోపణలను మెడికవర్ యాజమాన్యం ఖండించిందని తెలిపారు. ఈ సందర్భంగా.. మెడికవర్'ను ప్రారంభించిందే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCRBRS).. అని, ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతో 'మెడికవర్'కు సంబంధం లేదని, ఎక్కడా రాజకీయపరమైన విషయాల్లో మా జోక్యం ఉండదని మెడికవర్ యాజమన్యం చెప్పిన మాటలను రామ్మోహన్ రెడ్డి రాసుకొచ్చారు.

Advertisement

Next Story