- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్టీలు కొట్టిన కారు.. డ్రైవర్ సేఫ్! ఒక్క నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు: సజ్జనార్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ సమీపంలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద వేగంగా వెళ్తూ కారు మరో కారుని ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే స్పీడ్‌గా వచ్చిన కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. వెంటనే సిగ్నల్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్, ఇతర వాహనదారులు వచ్చి కారు డ్రైవర్‌ను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సేఫ్‌గానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వీడియో షేర్ చేస్తూ స్పందిచారు.
సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకరమన్నారు. తొందరగా వెళ్లాలనే ఆత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణమన్నారు. ఒక్క నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవని, ప్రపంచమేం ఆగిపోదని పేర్కొన్నారు. గుర్తుపెట్టుకోండి.. ఇలా సిగ్నల్ బ్రేక్ చేయడం ప్రమాదకరమని, రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాలకు కారణమై.. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చకండని సూచించారు.