Sania Mirza:సానియా మీర్జాపై సజ్జనార్ సంచలన ట్వీట్

by Nagaya |   ( Updated:2023-01-30 07:34:06.0  )
Sania Mirza:సానియా మీర్జాపై సజ్జనార్ సంచలన ట్వీట్
X

దిశ,డైనమిక్ బ్యూరో: మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలకు పలువురు సెలబ్రిటీలు మద్దతు ఇవ్వడం వాటిని ప్రమోట్ చేయడం మానుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత వారం మనీలాండరింగ్, హవాలా ఆరోపణలపై సోదాలు నిర్వహించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల్లోనూ సోదాలు జరిగాయి. అయితే క్యూనెట్ సంస్థకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడాన్ని సజ్జనార్ తప్పుపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సామాజిక వ్యవస్థను నాశనం చేసే మల్టీ లెవల్ మార్కెట్ కంపెనీలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఇలా జరగడం చాలా దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా ఎంఎల్ఎం కంపెనీలు విషయంలో సజ్జనార్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి కంపెనీలు తక్కువ పెట్టుబడికి అధిక డబ్బు వస్తుందని ఆశచూపి చివరకు కుచ్చుటోపీ పెడతాయని ఈ విషయంలో ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా క్యూనెట్ సంస్థకు సానియా మీర్జా ప్రమోటర్‌గా వ్యవహరించిన విషయంపై స్పందిస్తూ ఎంఎల్ఎం కంపెనీల ప్రమోటింగ్ విషయంలో మిగతా సెలబ్రిటీలు కూడా దూరంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story