- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర.. ఎల్లుండి నుంచి ప్రారంభం
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం, ఉచిత విద్యుత్ తదితర అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు నడుస్తున్నది. ఉచిత విద్యుత్‌పై రెండు పార్టీల నేతలు సవాళ్ళు విసురుకున్నారు. రైతును రాజు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం రైతుల్ని పావుగా వాడుకుని రాజకీయం చేస్తున్నదని ఆరోపిస్తున్నది. పరస్పరం రెండు పార్టీలు మూడు గంటలు.. మూడు పంటలు అనే అంశంతో విమర్శలు చేసుకుంటున్నారు. రైతు రుణమాఫీపైనా విస్తృతంగా చర్చ జరుగుతున్నది. వీటన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కిసాన్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా రైతుల్ని ఆకట్టుకోడానికి, వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుని వివరించడానికి ‘రైతు భరోసా యాత్ర’ను నిర్వహించనున్నది.
ఆదిలాబాద్ నుంచి ఈ నె 19న ప్రారంభమయ్యే ఈ యాత్ర 15 రోజుల పాటు జరిగి ఆగస్టు 2న నిజామాబాద్ జిల్లాలో ముగియనున్నది. కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్ర సందర్భంగా ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్ రైతు విభాగాలు కూడా పాల్గొంటున్నాయి. అక్కడి రైతుల్ని కిసాన్ సెల్ నేతలు కలిసి తాజా పరిస్థితిపై మాట్లాడనున్నారు. రైతుల్ని సంఘటితం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ యాత్ర ద్వారా ప్రస్తుతం రైతుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న రాజకీయ క్రీడ గురించి వారికి వివరించనున్నట్లు కిసాన్ సెల్ నేత ఒకరు తెలిపారు. రైతాంగానికి 24 గంటలూ ఉచితంగా విద్యుత్ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ పది గంటలకు మించి రావడం లేదన్నది కాంగ్రెస్ వాదన.
రైతు భరోసా యాత్ర సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులను కాంగ్రెస్ కిసాన్ సెల్ నేతలు రైతులనే అడిగి తెలుసుకోనున్నారు. వరంగల్ బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లోని అంశాలతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి, రైతాంగానికి ఇవ్వనున్న సాయం గురించి ఈ యాత్ర సందర్భంగా కిసాన్ సెల్ నేతలు వివరించనున్నారు. వారిలో భరోసా కల్పించడమే టార్గెట్‌గా జరుగుతున్న యాత్రలో రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ, రైతుబంధు సాయాన్ని పెంచడం, కౌలు రైతులకూ అవకాశం కల్పించడం, ధరణి ఫోర్టల్ లోపాల స్థానే సమగ్రమైన విధానాన్ని తీసుకురావడం.. తదితర అనేక వ్యవసాయ సంబంధ, రైతు కేంద్రంగా ఉండే అంశాలను ప్రస్తావించనున్నారు.