- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్.. తెలంగాణకు భారీ నష్టం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎగుమతులపై రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్ పడింది. సుమారు 850కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. రాష్ట్రం నుంచి ఆయా దేశాలకు ఎగుమతి అయ్యే వాటిలో సింహభాగం ఫార్మా, కెమికల్ ఎగుమతులే. అయితే యుద్దం ముగియకపోతే ఎగుమతులపై మరింత ప్రభావం పడనుంది. రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది ఫార్మా, కెమికల్ కు సంబంధించినవే. అయితే రష్యా, ఉక్రెయిన్ దేశాలకు ఏటా వేల కోట్ల రూపాయల విలువైన వస్తువులను తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయి. గతేడాది రష్యాకు 2586కోట్ల ఎగుమతులు అయ్యాయి. ఈ ఏడాది జనవరి చివరి నాటికి 1940కోట్లు మాత్రమే ఎగుమతులు కాగా, ఫిబ్రవరి, మార్చిలో తగ్గుముఖం పట్టింది. కేవలం 40కోట్లు ఎగుమతులు మాత్రమే అయినట్లు పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్ కు గతేడాది 550కోట్ల వరకు ఎగుమతులు కాగా.. ఈ ఏడాది జనవరి చివరి నాటికి 288కోట్లు మాత్రమే జరిగినట్లు అధికారులు నివేదికలో తెలిపారు. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది ఎగుమతులు 2 శాతం పెరగాల్సి ఉండగా.. ఈ ఏడాది యుద్దం కారణంగా తగ్గాయి. ఈ ఎగుమతుల్లో 65శాతం ఫార్మా, కెమికల్ రంగానికి చెందినవి కావడం విశేషం. రష్యాకు ఎగుమతి చేస్తున్న రాష్ట్రాలలో 4.01శాతంతో మూడోస్థానంలో ఉంది. యూఎస్ఏ కు 16946కోట్లు ఎగుమతులు శాతంలో 26.26 కాగా, చైనాకు 4377కోట్లు ఎగుమతులను తెలంగాణ నుంచి చేస్తోంది. 6.78శాతంను తెలంగాణ నుంచే ఎగుమతి అవుతోంది.
ఇదిలా ఉంటే యుద్ధం కారణంగా రష్యాకు సుమారు రూ.600కోట్లు, ఉక్రెయిన్ కు సుమారు రూ.262కోట్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. యుద్ధం కొనసాగిస్తే ఎగుమతులపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. రష్యాకు ఫార్మా స్యూటికల్ ప్రొడక్టు 1240 కోట్లు, ఆర్గానిక్ కెమికల్స్ 364కోట్లు, ఎలక్ట్రికల్ మిషనరీలు 123కోట్లు, ఇతర ఎగుమలు 213 కోట్లు ఎగుమతులను తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఉక్రెయిన్ కు ఫార్మా ప్రొడక్ట్స్ 213కోట్లు, టూల్స్ అండ్ బేస్ మెటల్ 24కోట్లు, న్యూక్లీయర్ రియాక్టర్స్ 18కోట్లు, ఇతర ఎగుమతులు 33కోట్లు తెలంగాణ ఎగుమతులు చేసింది. అయితే యుద్ధం ఇలాగే కొనసాగి ఇతర దేశాలకు సైతం విస్తరిస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడనుందని, కంపెనీలు సైతం దివాళా తీసే అవకాశం ఉందని పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.