- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లూయిస్ బ్రెయిలీ లిపి అంధుల పాలిట వరం
దిశ, జగిత్యాల టౌన్ : లూయిస్ బ్రెయిలీ లిపి అంధులపాలిట గొప్ప వరమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ 216 వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణ దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించి గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రాధాన్యం ఇస్తామన్నారు.
అలాగే అంధత్వ నివారణ లక్ష్యంగా ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయడం ఓ సామూహిక బాధ్యతగా భావిస్తానని అన్నారు. జగిత్యాలలో సఖి కేంద్రం, బాల సదన్, వృద్ధాశ్రమం భవనాలు, ఇందిరా శక్తి భవనాల నిర్మాణంలో భాగంగా ఐదు కోట్లతో భవనం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. అలాగే అంధులకు జగిత్యాలలో స్థలం కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీడబ్ల్యూ ఓ నరేష్, ఈఈఏ హెచ్. ఖాన్, వాజిద్, సీడీపీఓ మమత, తదితరులు పాల్గొన్నారు.