ప్రైవేట్ ఆసుపత్రిలో అధికార పార్టీ ఎమ్మెల్యే హల్‌చల్

by Sathputhe Rajesh |
ప్రైవేట్ ఆసుపత్రిలో అధికార పార్టీ ఎమ్మెల్యే హల్‌చల్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని సరస్వతినగర్‌లో గల ఎం.ఆర్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ హల్ చల్ చేశారు. తన నియోజకవర్గంలోని గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన జ్యోతి అనే పేషెంట్‌ను పరామర్శించేందుకు హోలీ నాడు ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి మండిపడ్డాడు. ఆసుపత్రిలో వైద్యులు ఎక్కడా అని ప్రశ్నించారు. గుండెనొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన జ్యోతికి ఏం వైద్యం చేశారని నిలదీశారు. మంగళవారం సాయంత్రం ఆసుపత్రిలో ఆ సమయంలో వైద్యులు లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జ్యోతి పరిస్థితి క్రిటికల్‌గా మారిన ఎందుకు రిఫర్ చేయలేదని నిలదీశాడు. అక్కడున్న సిబ్బంది ఎమ్మెల్యేకు సమాదానం చెప్పేలోపే చేయి చూసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను సద్దుమనిగేలా చేశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతుండగా 1వ టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. జ్యోతిని రాత్రి హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన సంబంధించిన వీడియోలు ఉన్న వాటిని బహిర్గతం చేయలేదని సమాచారం.

కొందరు పెద్దలు రంగంలోకి దిగి రాజీయత్నం చేసినట్లు తెలిసింది. ఎంఆర్. ఆసుపత్రి పేరుకే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఉన్నప్పటికీ అందులో స్పెషాలిటీ వైద్యులు లేరని కేవలం అన్‌కాల్‌లో వైద్యులను రప్పించి వైద్యం చేస్తారని ఆరోపణలున్నాయి. గతంలో వైద్య ఆరోగ్యశాఖ ఆసుపత్రిని నిర్వహణపై ఫిర్యాదులు ఉన్నాయి. ఎం.ఆర్.ఆసుపత్రికి అనుమతి సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి అనుమతి ఇప్పించాడని, రెగ్యులర్ వైద్యులు లేరని ఆరోపణలున్నాయి. ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యులుగా చెబుతున్నప్పటికీ కనీసం హాస్పిటల్ ప్రిస్కిప్షన్‌పై సంబంధిత వైద్యులు ఎవ్వరు అన్నది ఉండదనే విమర్శలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed