- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RTC వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు: APSRTC ఎండీ ద్వారక తిరుమలరావు
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ స్టాఫ్ సేవలు అమోఘమని, పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు పేర్కొన్నారు. అఖిల భారత ప్రజా రవాణా సంస్థ కబడ్డీ టోర్నమెంట్‌ను ఆయన, టీఎస్ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు మాట్లాడుతూ.. హకీంపేటలోని ట్రాన్స్‌పోర్ట్ అకాడమీలో అఖిల భారత ప్రజా రవాణా సంస్థల టోర్నమెంట్ ఉద్యోగుల్లో స్పూర్తిని నింపుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థకు చెందిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) కబడ్డీ టోర్నమెంట్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉద్యోగులంతా మంచి ఆహారపు అలవాట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఏఎస్‌ఆర్టీయూ డైరెక్టర్ ఆర్.ఆర్.కె.కిషోర్, టీఎస్‌ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పి.వి.ముని శేఖర్, సి.వినోద్ కుమార్, సీపీఎం కె.కృష్ణకాంత్, సీఎంఈ టి.రఘునాథ రావు, సికింద్రాబాద్ ఆర్ఎం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.