ఆర్ఎస్‌పీ బాటలో ఆయన తమ్ముడు.. ఉద్యోగానికి రాజీనామా చేేసి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ

by Mahesh |   ( Updated:2023-11-08 14:55:10.0  )
ఆర్ఎస్‌పీ బాటలో ఆయన తమ్ముడు.. ఉద్యోగానికి రాజీనామా చేేసి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంత తమ్ముడు అన్న బాటలో నడవడానికి ముందుకు వచ్చాడు. పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డా.రేపల్లె ప్రసన్న కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. =స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన బుధవారం బీఎస్పీలో చేరారు. ఆయన చేరిక వల్ల బీఎస్పీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని పార్టీ నాయకులు, అభిమానులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. బీఎస్పీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. బీఎస్పీ అలంపూర్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయన ఆ పార్టీ చీఫ్ నుండి బి ఫారం అందుకున్నారు. నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. గతంలో డా.రేపల్లె ప్రసన్న కుమార్ అలంపూర్ నుంచి 2009 లో తెదేపా అభ్యర్ధిగా స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు.

Also Read..

జనసేన అభ్యర్థులకు బీ ఫామ్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో తొలిసారి పోటీపై కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story