రైతు ఆత్మహత్యలు లేవన్నKCR పై R S Praveen Kumar ఫైర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-04 12:11:42.0  )
రైతు ఆత్మహత్యలు లేవన్నKCR పై R S Praveen Kumar ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వ్యవసాయం బాగుపడటం వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఫామ్ హౌస్, ప్రగతి భవన్‌లను వదిలి బయటకు వస్తే కదా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉన్నాయో లేదో తెలిసేదని మండిపడ్డారు. రైతుబంధు పేరుతో వేల కోట్ల రూపాయలను భూస్వాములకు ఇస్తూ ఎకరం భూమి ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే అరకొర సహాయం కనీసం పెట్టుబడికి కూడా సరిపోవడం లేదన్నారు. సీఎం వ్యాఖ్యలపై శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన ప్రవీణ్ కుమార్..

అసలు మీ ప్రభుత్వంలో కౌలు రైతుల గురించి మాట్లాడటమే నేరం అయిందని ధ్వజమెత్తారు. కౌలు రైతుల గురించి మాట్లాడితేనే ఉరికించి కొడతామంటిరి కదా అని విమర్శించారు. కాగా నిన్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు సంక్షేమం వర్ధిల్లుతోందని బీఆర్ఎస్ వచ్చాక తెలంగాణలో ఆత్మహత్యలు లేవన్నారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశమంతటా 24 గంటల కరెంట్ సరఫరా, వ్యవసాయానికి ఫ్రీ విద్యుత్ అందజేస్తామన్నారు.

Advertisement

Next Story