- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయం చెప్పకుండానే ఆర్ఎస్పీ పార్టీ మారారు.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నాళ్లు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను విమర్శించి ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరుతారని కొందరు ప్రశ్నిస్తుంటే బీఆర్ఎస్ లో చేరడాన్ని మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారే క్రమంలో జరిగిన పరిణామాలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభాకర్.. బీఎస్పీలో ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఏంటో పార్టీలో కానీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించలేదని, పార్టీ మారుతున్న విషయం కూడా చెప్పకుండానే ఆయన బీఎస్పీని వీడి వెళ్లిపోయారన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ముందు తానే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానని తానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని మాయావతిని కోరారన్నారు. బీఎస్పీలో చేరే సమయంలో లక్షలాది మందితో బహిరంగ సభలో చేరిన ప్రవీణ్ కుమార్.. బీఆర్ఎస్ లో మాత్రం ఫామ్ హౌస్ లోని ఓ రేకుల షెడ్డు కింద చేరారని దీని బట్టి చూస్తే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వీక్ అయ్యారేమో అనిపిస్తోందన్నారు.
పార్టీలో చేరిన ఆర్ఎస్పీకి ముఖ్యమైన పదవి ఇస్తానన్న కేసీఆర్ మాటలను తాను నమ్మలేనన్నారు. పార్టీని వీడితూ బహుజన సిద్ధాంతాన్ని విడిచిపెట్టబోనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రతిపార్టీలో బహుజన వాదులు ఉన్నారని అయితే వేర్వేరు పార్టీలో ఉండి బహుజనవాదుల కోసం ఏమి చేయలేకపోతున్నామని అనేక మంది తన వద్ద ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరి బహుజన వాదానికి ఏదో చేస్తారని తాను విశ్వసించడం లేదన్నారు. బహుజన వాదం అంటే ప్రవీణ్ కుమార్ కాదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరాక పార్టీకి అంతకు ముందు లేని విజిబులిటీ వచ్చిన మాట వాస్తవమే అయినా ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై ఇప్పటికిప్పుడే స్పందించలేనని మరికొంత టైమ్ వేచిచూచి స్పందిస్తామన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో 17 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోతున్నామన్నారు.