తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రీడా రంగానికి 9 ఏళ్లలో రూ.1200 కోట్లు: ఆంజనేయ గౌడ్

by Satheesh |   ( Updated:2023-04-21 17:24:58.0  )
తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రీడా రంగానికి 9 ఏళ్లలో రూ.1200 కోట్లు: ఆంజనేయ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 1200కోట్లకు పైగా క్రీడారంగానికి ఖర్చు చేసిందని సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పదిహేడు వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గానికో స్టేడియం నిర్మించినట్లు వెల్లడించారు. ఓయూ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన టెక్నాలజీ కళాశాల వార్షిక క్రీడా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు వివాదాలు, నినాదాల వెంట కాదు క్రీడల వెంట నడవాలని పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టి ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి పునాదులు వేశారని కీర్తించారు.

తెలంగాణ రాష్ట్రంలో క్రీడలు గ్రామపునాదుల నుంచి కీలకంగా మారాయని చెప్పారు. జీవితంలో ప్రతీ రోజూ క్రీడలు, వ్యాయామానికి సమయం కేటాయించాలని, లేనిపక్షంలో జీవితం నిస్సారంగా మారుతుందని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత సాయిలు, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హయవదన, ప్రొఫెసర్ వి. సత్యనారాయణ, డాక్టర్ డి. అర్జున్, సర్దార్ జస్పాల్ సింగ్, డాక్టర్ ఎ. పరుశురాం,బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండగాని కిరణ్ గౌడ్, తుంగ బాలు, రమేష్, శ్రీమాన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed