- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బూర నర్సయ్య నిర్ణయాన్ని స్వాగతించిన RSP.. బీఎస్పీలో చేరాలని ఆహ్వానం
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తీసుకున్న నిర్ణయాన్ని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వాగతించారు. దొరల గడీల బందీఖానాల నుంచి విముక్తుడైన డా.బూర నర్సయ్య గౌడ్ కు అభినందనలు అంటూ శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీఆర్ఎస్ ను వీడిన నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ అలాంటి తప్పిదమే ఆయన చేయరని భావిస్తున్నట్లు ఆర్ఎస్పీ అన్నారు. పెనంల నుంచి పొయ్యిల పడొద్దని సూచించారు. మన గడ్డపై బహుజన రాజ్యస్థాపనకై తమతో కలిసి రావాలని ఆహ్వానం అందించారు. బహుజనుల కోసం కలుద్దాం, నిలుద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీకి రాజీనామా చేస్తూ నర్సయ్య గౌడ్ రాసిన లెటర్ లోని ఓ భాగాన్ని ఆర్ఎస్పీ షేర్ చేశారు. 'మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఒక మాజీ ఎంపీ అయినప్పటికీ, ఒక్క సారి కూడా మాతో సంప్రదించలేదని, నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో, మాకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకున్నా, అవమానాన్ని దిగమింగుకుని ఉన్నాను. అది మీకు తెలిసినా కూడా మౌనంగా ఉన్నారు. మునుగోడు టికెట్ అసలు నాకు సమస్యే కాదు, కానీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ పరిశీలించండి అని అడగడం కూడా నేరమే అయితే ఈ పార్టీలో ఉండటమే అనవసరం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య రంగాలలో వివక్షకు గురికావడం బాధకరం అంటూ బూర నర్సయ్య గౌడ్ రాసిన రాజీనామా లేఖలోని భాగాన్ని ఆర్ఎస్పీ ట్విట్టర్ లో షేర్ చేశారు.
కాగా, అధికార టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నర్సయ్య గౌడ్ తదుపరి కార్యచరణపై ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ లేదు. ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. శుక్రవారం బీజేపీ జాతీయ పెద్దలతో బూర నర్సయ్య గౌడ్ భేటీ అయ్యాక రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎంపీగా ఢిల్లీలో ఉన్న సమయంలో బీజేపీ ప్రస్తుత జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నర్సయ్య గౌడ్ కు పరిచయం ఉందని చాలా కాలంగా ఆయన బీజేపీ టచ్ లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో అవమానాలు జరుగుతున్నా ఓపికగా ఉన్న నర్సయ్య ఇక అవమానాలు రోజు రోజుకు అధికం కావడంతో పార్టీని వీడక తప్పలేదనే టాక్ వినిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ కు మాజీ ఎంపీ గుడ్ బై చెప్పడం అధికార పార్టీలో అలజడి రేగింది. బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ నుండి బిగ్ వికెట్ పడిపోవడం కారు పార్టీని అయోమయానికి గురి చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరి కొంత మంది నేతలు కూడా టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.