- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్‌ఆర్‌ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడులో బహుజన వాదమే గెలుస్తుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడులో ఉప ఎన్నికలో బహుజన వాదమే గెలుస్తుందని, మునుగోడులో విజయదుందుభి మోగిస్తామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమ వ్యక్తం చేశారు. అమెరికా పర్యాటనలో ఉన్న ఆయన ఆదివారం గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ప్రతినిధి రాయ్‌దాస్ మంతేనా నిర్వహించిన ట్విట్టర్ స్పేస్ మీటింగ్‌లో మాట్లాడారు. మునుగోడులో ప్రజల్లోకి బలంగా దూసుకుపోతుందని అన్నారు. కేసీఆర్ పెట్టే అక్రమ కేసులకు, తాటాకు చప్పుళ్ళకు బీఎస్పీ పార్టీ బయపడదన్నారు.
ఇంద్రవెల్లి లో ఒక పేద గిరిజన యువతి అనుమానాస్పద మృతిలో ఎమ్మెల్యే రేఖ నాయక్ అనుచరుడి పాత్రను వెలుగులోకి తీసుకొచ్చినందుకు బీఎస్పీ నిర్మల్ ఇన్‌చార్జ్ రాథోడ్ బన్సిలాల్‌పై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే రేఖ నాయక్‌తో బీఎస్పీ ఇన్‌చార్జ్ రాథోడ్ బన్సిలాల్‌పై దుర్భాషలాడారని, కేసీఆర్‌కు ఏమాత్రం సిగ్గు ఉన్నా ఎమ్మెల్యే రేఖ రాథోడ్‌తో బన్సిలాల్‌కు క్షమాపణలు చెప్పించాలన్నారు. సీఎం ఈ బూతు భాషను నేర్పిస్తున్నారని, రాష్టంలోని నేతలు కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారని వివరించారు. కేసీఆర్ పాలనలో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు, నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కేటీఆర్ గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి లక్షలు ఖర్చు చేశామని చెప్పారని ఇవ్వన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.