AP News:‘గత ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్వీర్యం చేసింది’.. మంత్రి కొండపల్లి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:‘గత ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్వీర్యం చేసింది’.. మంత్రి కొండపల్లి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీడీపీ(TDP), వైసీపీ(YCP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli Srinivas) ఆరోపించారు. ఏపీ ఛాంబర్ ఆధ్వర్యంలో విజయవాడ(Vijayawada)లో నేడు(మంగళవారం) బిజినెస్ ఎక్స్ పో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోకపోవడంతో చాలా పరిశ్రమలు(industries) పక్క రాష్ట్రాలకు వెళ్లి పోయాయని ఆయన అన్నారు. ఈ క్రమంలో వేలాదిమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఫైరయ్యారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం(AP Government) వచ్చిన తర్వాత పరిశ్రమల(industries) ఏర్పాటు పై ప్రత్యేక విధానాలను అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని చెప్పారు. చిన్న తరహా సహా పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పరంగా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా బ్యాంకు నుంచి రుణాలను కూడా అందజేస్తున్నామని అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం పరిశ్రమలు ప్రోత్సహించడం స్వాగతిస్తున్నామని అన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమల విధానాలు ప్రోత్సాహకాలను కూడా తాము పరిశీలిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ భరోసా కింద జనవరిలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత 6 నెలలకోసారి అర్హతను బట్టి కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు. భర్త చనిపోయినవారు డెత్ సర్టిఫికెట్ సమర్పించిన మరుసటి నెల నుంచే పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానం డిసెంబర్ నుంచే అమలు చేయాలని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed