- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Guntur: నందిగం సురేశ్‌కు షాక్.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్(Former YCP MP Nandigam Suresh)కు వరుస షాకులు తగులుతున్నాయి. ఉండవల్లిలో జరిగిన మహిళ హత్య కేసులో సోమవారం ఆయనకు కోర్టు రిమాండ్ పొడిగించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తాజాగా కోర్టు విచారణను వాయిదా జరిగింది. తనకు బెయిల్ మంజూరు(Bail Gant) చేయాలని కోరుతూ సురేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే కొద్దిసేపటికే విచారణను ఈ నెల 7కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం(Mangalagiri Telugu Desam Party Office)పై దాడి కేసులో నందిగం సురేశ్ ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఉండవల్లిలో మహిళ హత్య కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. 2023లో మూడు రాజధానుల(Three capitals) శిబిరం వద్ద అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి తిరుగి వెళ్తు్న్న తమపై అప్పటి ఎంపీ నందిగం సురేశ్‌తో పాటు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్(YCP leader Borugadda Anil), వారి అనుచరులు దాడులు చేశారని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేశ్ గుంటూరు జిల్లా కోర్టు(Guntur District Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.