ముత్తంగి క్రీడా ప్రాంగణం అభివృద్ధికి చర్యలు : ఎమ్మెల్యే

by Kalyani |
ముత్తంగి క్రీడా ప్రాంగణం అభివృద్ధికి చర్యలు : ఎమ్మెల్యే
X

దిశ,పటాన్ చెరు : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామంలో గల క్రీడా ప్రాంగణం అభివృద్ధికి నిధులు కేటాయించబోతున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా విస్తరిస్తున్న ముత్తంగి గ్రామ పరిధిలో క్రీడా ప్రాంగణం ఎంతో ప్రాధాన్యతమైనదిగా పేర్కొన్నారు. పచ్చదనంతో పాటు వివిధ రకాల క్రీడా కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మాజీ సర్పంచ్ ఉపేందర్, గడీల శ్రీకాంత్ గౌడ్, సిల్వరి శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed