KTR: మా ధర్నాకు కేటీఆర్‌ను అసలు ఆహ్వానించ లేదు.. ఆటో డ్రైవర్ల సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-11-05 10:32:41.0  )
KTR: మా ధర్నాకు కేటీఆర్‌ను అసలు ఆహ్వానించ లేదు.. ఆటో డ్రైవర్ల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారంటీ (Six Guarantees)ల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఆర్టీసీ (RTC) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకాన్ని (Maha Lakshmi Scheme)ను ప్రవేశ పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు (Auto Drivers) నిరసన బాటపట్టారు. ఫ్రీ బస్ కారణంగా తమకు బతుకుదెరువు కరువైందని ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఇవాళ ఇందిరా పార్క్ (Indira Park) వద్ద ధర్నా చేపట్టారు. అయితే, ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) హాజరై ఆటో డ్రైవర్లకు సంఘీభావం ప్రకటించారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. తాము చేపట్టిన ధర్నాకు కేటీఆర్‌ (KTR)ను అసలు తాము ఆహ్వానించలేదని.. ఎవరితోనూ కబురు పెట్టలేదని ఆటోడ్రైవర్లు పేర్కొన్నారు. ఆయనంతట ఆయనే దీక్షా శిబిరానికి వస్తున్నట్లుగా ప్రకటించుకున్నాడని కామెంట్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఆటోడ్రైవర్లకు ఆ ప్రభుత్వం చేసిందేమి లేదని ఫైర్ అయ్యారు. కేవలం వ్యక్తిగత, స్వార్థపూరిత రాజకీయాల కోసం ఆయన ఇవాళ ధర్నాకు వచ్చారని.. తమ కోసం రాలేదని ఆరోపించారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న తమను రాజకీయాలకు వాడుకోవద్దని ఆటో డ్రైవర్లు కేటీఆర్‌కు హితువు పలికారు.

Advertisement

Next Story

Most Viewed