- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Municipal Commissioner Ashrit Kumar : పుట్‌పాత్‌లు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
దిశ, సిద్దిపేట అర్బన్ : ఫుట్ పాత్ లు కేవలం పాదాచారుల కొరకు నిర్మించడం జరిగిందని వాటిని ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. రోడ్డు ఆక్రమణ నియంత్రణ చర్యలపై సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణంలో గల టీఫిన్ సెంటర్ లు,హోటల్ లు ఇతరత్రా వాణిజ్య వ్యాపారులు రోడ్డు వైపుగా వచ్చేలా వేసిన రేకుల షెడ్ లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. పుట్ పాత్ లను ఆక్రమించిన ఏర్పాటు చేసిన బోర్డులు, ఫ్లెక్సీలను తొలగించాలన్నారు. వారంలో ఒక రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ ప్రేరణ, టీపీవో దేవరాజు, ఎఈఈ పృథ్వి, శానిటరీ ఇన్ స్పెక్టర్ లు వనిత, మాధవి, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.