- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా నిల్చున్న ప్రతి సందర్భం నాకు ఇష్టమే.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ‘కుమారి 21ఎఫ్’(Kumari 21F) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది హెబ్బా పటేల్(Hebah Patel). ఇక హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండా ప్రజెంట్ వరుస సినిమాలతో సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. త్వరలో ‘ధూం ధాం’ (Dhoom Dham movie)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. చేతన్ కృష్ణ (Chetan Krishna), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా నటిస్తున్న ఈ మూవీకి.. సాయికిశోర్ మచ్చా (Director Saikishore Macha) దర్శకత్వం వహిస్తుండగా ఎం.ఎస్. రామ్ కుమార్(M.S. Ram Kumar) నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, పోస్టర్లు ఆకట్టుకోగా.. పాజిటివ్ అంచనాల మధ్య ‘ధూం ధాం’ ఈ నెల 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హెబ్బా.. సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
‘‘ధూం ధాం’ లాంటి సినిమా చేసి చాలా కాలం అవుతోంది. ఇందులో సుహానా అనే యువతిగా నటించా. బాగా డబ్బున్న ఆ యువతికి ఇంట్లో కావల్సినంత స్వేచ్ఛ ఉండటంతో.. విహారం కోసం తను కోరుకున్న ప్రాంతానికల్లా వెళ్తుంటుంది. అలా వెళ్లిన క్రమంలోనే ఆమెకు హీరో పరిచయం అయ్యి.. అతనితో ప్రేమలో పడుతోంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ కథలో చాలా కీలకంగా ఉంటుంది. ఈ సినిమాలో నటన పరంగా నాకు ఎలాంటి సవాళ్లు ఎదురు కాలేదు. అయినా.. ఓ నటిగా కెమెరా ముందు నిల్చున్న ప్రతి సందర్భం నాకు ఇష్టమే. సినిమా(Movie), వెబ్ సిరీస్(Web series), ఆఖరికి ఫొటోషూట్ (Photoshoot)అయినా సరే ఆస్వాదిస్తా. కొత్త సినిమాకి సైన్ చేసిన టైం నుంచి రిలీజ్ వరకు.. అలాగే మంచి టాక్ వచ్చిన రోజు నా సంబరాలు ‘ధూం ధాం’గా ఉంటాయి. అంత పిచ్చి నాకు సినిమా అంటే. ప్రజెంట్ తెలుగుతో పాటు తమిళంలోనూ మూవీస్ చేస్తున్నా’ అని చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్.
Read More..
Samantha: “గతంలో తప్పులు చేశా.. ఒప్పుకుంటున్నా”.. సమంత సంచలన కామెంట్స్.. పెళ్లి గురించేనా..?