మైలార్ దేవుపల్లి లో దారుణం.. 13 రోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి

by Kalyani |
మైలార్ దేవుపల్లి లో దారుణం.. 13 రోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి
X

దిశ, శంషాబాద్ : 13 రోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది, మృతదేహం నీళ్ల బకెట్ లో లభ్యమైన ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ లో చోటు చేసుకుంది. మైలార్దేవుపల్లి సి. నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముడలి మణి అతని భార్య ఆరోజియా విజి తో ఐదు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కొరకు మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో నివాసం ఉంటున్నారు. వీరికి విజ్జి (1) కుమారుడు ఉన్నాడు. గత 13 రోజుల క్రితం అతని భార్య అరోజియ ఒక పాపకు జన్మనిచ్చింది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో భర్త ముడలి మణి తన పని నిమిత్తం కంపెనీకి వెళ్ళాడు. అతని భార్య ఫోన్ చేసి నేను స్నానం చేస్తుండగా పాప నీళ్ల బకెట్లో పడి ఉందని చెప్పడంతో వెంటనే 13 రోజుల పసికందును ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed