పోలీస్ రిక్రూట్మెంట్‌లో రోస్టర్ విధానం అమలవుతుందా?

by GSrikanth |
BSP Chief RS Praveen Kumar Says An acre of land for the poor if we are empowered
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పోలీస్ నియామకాల్లో టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు వందశాతం విఫలమైందని, తప్పుగా ప్రశ్నలు ఇవ్వడం, ప్రిలిమ్స్‌లో సిలబస్ పాటించకపోవడం, రిజర్వేషన్ తొలగించడం ఇలా తన ఇష్టానుసారంగా బోర్డు నియామకాలు నిర్వహిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. "పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష మీద, రోస్టర్ విధానం అమలుపై పలు ఆరోపణలొస్తున్నయి. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నడా? ఉంటే దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది " అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా మరొక ట్వీట్ చేస్తూ.. జగిత్యాల జబితాపూర్‌కు చెందిన పేద రైతు కూలీ బిడ్డ నక్కా లక్ష్మణ్ చదువుకొని తన శ్రమ వల్ల అమెరికా వచ్చి ఆర్థికంగా ఎదిగి అత్యంత శక్తిమంతులైన అమెరికా మంత్రులు నివసించే మక్లీన్ ఏరియా, వర్జీనియాలో గొప్ప భవంతి కట్టుకున్నడని వివరించారు. బహుజనరాజ్యంలో కూడా ఇంత గొప్పగా బతికేలా పేద బిడ్డలను తయారు చేస్తానని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed