ఎన్ని వేల కోట్లుంటే దేశమంతా ఖర్చు పెట్టడానికి ధైర్యం వస్తది?: RSP

by GSrikanth |
ఎన్ని వేల కోట్లుంటే దేశమంతా ఖర్చు పెట్టడానికి ధైర్యం వస్తది?: RSP
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్ని వేలకోట్లు వెనకేసుకుంటే దేశమంతా ఖర్చు పెట్టనీకి ధైర్యం వస్తది? అంటూ సీఎం కేసీఆర్‌పై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తన వీక్లీ బ్యాట్‌బ్లాగ్‌లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. తన సహచరులతో ప్రతిపక్షాల కూటమికి తనను చైర్ పర్సన్‌ను చేస్తే.. 2023 ఎన్నికల మొత్తం ఖర్చు భరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడంటూ రాజ్‌దీప్ వెల్లడించిన విషయాలపై ప్రతిపక్ష నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటూ విమర్శలు గుప్పించారు. అటు మోడీ-అదాని దేశాన్ని ఎంత దోచుకున్నరో...అంతే కేసీఆర్, ఆయన కంపెనీ తెలంగాణను కూడా దోచుకున్నరని ఆయన ఆరోపించారు. స్కీములేమో మాకు, స్కాములేమో మీకా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా, దేశమంతటా ఖర్చు పెట్టాలని చూసే కేసీఆర్.. ఆ ఖర్చును గత తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ బిడ్డల మీద పెట్టి ఉంటే మన రాష్ట్రం కేరళ కన్నా గొప్పగా అభివృద్ది అయ్యి ఉండేదని ఆర్ఎస్పీ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story