- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారం 100 హత్యలతో సమానం: RS ప్రవీణ్ కుమార్
దిశ, వెబ్ డెస్క్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాల ముద్రణ, భద్రత అంతా బోర్డు చైర్మన్‌దేనని.. నిబంధనలు కూడా అదే చెబుతున్నాయని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో సంచలన సృష్టిస్తోన్న టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై బుధవారం ఆయన స్పందించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులే ప్రధాన నిందితులు అని ఆరోపించారు. ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ చైర్మన్, బోర్డు సభ్యులను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం 100 హత్యలతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ల లీకేజీ కేసులో పెన్ డ్రైవ్, హనీ ట్రాప్, హ్యాకింగ్ అంతా కట్టుకథ అని ఆరోపణలు చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
రెండేళ్లుగా పేపర్లు లీకవుతున్నాయనే విషయం టీఎస్‌పీఎస్సీ పెద్దలకు ముందే తెలుసన్నారు. పేపర్ల లీక్ వ్యవహారంలో చైర్మన్ తానే బాధితుడిని అని ప్రచారం చేసుకుంటున్నారని.. కానీ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బాధితుడు కాదని.. నిందితుడని మండిపడ్డారు. పేపర్ల లీక్ కేసులో సిట్ ఇప్పటివరకు ఇస్తోన్న లీకులన్నీ కట్టుకథలే అని అన్నారు. ఈ పేపర్ల లీక్ వెనుక పలువురు టీఎస్‌పీఎస్సీ బోర్డు ఉద్యోగుల పాత్ర కూడా ఉందని ఆర్ఎస్సీ ఆరోపణలు గుప్పించారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి రమేష్‌కు 120 మార్కులు.. వెంకటేశ్వర రావుకు 120 మార్కులు.. మరో ఉద్యోగి వెంకటేశ్వర్లుకు 115 మార్కులు.. మరో ఎంప్లాయి షమీమ్‌కు 123 మార్కులు వచ్చాయని ఆయన వెల్లడించారు.