- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోదండరాంతో ఆర్ఎస్పీ భేటీ.. పేపర్ లీకేజీ స్కాంపై ఐక్య పోరు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ప్లేస్‌లో మంగళవారం భేటీ అయినట్లు సమాచారం. ప్రస్తుత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల మీద సుదీర్ఘంగా చర్చించారు. టీజేఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న తెలంగాణ బచావో ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కోరారు.
ఇరువురి మధ్య టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణం గురించి చర్చించారు. పేపర్ లీకేజీల కుంభకోణాన్ని సీబీఐకి అప్పగిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చర్చజరిగింది. దీనికోసం కలిసి వచ్చే పార్టీలతో, ప్రజాసంఘాలతో, విద్యార్థి, నిరుద్యోగ సంఘాలతో త్వరలోనే ఉమ్మడి ఉద్యమ కార్యాచరణను విస్తృతం చేయాలని కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.