1948 నాటి చట్టాల ప్రకారం జీతాలు ఇస్తే ఎట్ల?

by GSrikanth |
1948 నాటి చట్టాల ప్రకారం జీతాలు ఇస్తే ఎట్ల?
X

దిశ, వెబ్‌డెస్క్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు గతకొన్ని రోజులు సమ్మే చేస్తున్న విషయం తెలిసిన విషయం తెలిసిందే. అయితే, సమ్మెపై స్పందించిన యాజమాన్యాలు వెంటనే విరమించాలని హెచ్చరించారు. అంతేగాక, సమ్మెకు దిగిన ఆర్టిజన్లను ఉద్యోగాలను నుంచి తొలగించాలని విద్యుత్ సంస్థల యజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇతర ఆర్టిజన్లను సమ్మెకు పురిగొల్పినా లేక సమ్మెకు ఆర్థిక సాయం అందించినా ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని స్పష్టం చేశాయి.

తాజాగా.. యాజమాన్యాలు జారీ చేసిన ఉత్తర్వులపై బీఎస్‌పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ‘‘తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు బీఎస్‌పీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. నిజానికి ఈ 23,000 మంది కార్మికులు రాత్రింబవళ్లు పని చేయడం వల్లనే సంస్థలు నడుస్తున్నవి. 1948 నాటి చట్టాల ప్రకారం వీళ్లకు జీతం ఇస్తే ఎట్ల? వాళ్లడుగుతున్నది కేవలం పేస్కేలు, ఉద్యోగ భద్రతనే కదా!’’ అని ట్వి్ట్టర్ వేదికగా మద్దతు పలికారు.


Advertisement

Next Story