సాంస్కృతిక సారథి కళాకారులలకు 4 నెలలుగా జీతాలు లేవు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Javid Pasha |
RS Praveen Kumar
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సాంస్కృతిక కళాకారులకు 4 నెలలుగా జీతాలు లేవని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జీతాలు రాక వాళ్లంతా ఇబ్బందిపడుతోందటే సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

రకరకాల కారణాలతో పూర్తిగా టెంపరరీగా, కళాకారులను చాలీచాలని జీతాలు ఇస్తూ, ప్రభుత్వ వ్యతిరేక పాటలు పాడనివ్వకుండా గొంతు నొక్కుతున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 585 మంది కళాకారులు విలవిల్లాడుతున్నారని ఆయన తెలిపారు.

Advertisement

Next Story