మీ ఫాం హౌస్‌ల చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ ఇలాగే ఉంటుందా?

by Mahesh |   ( Updated:2023-05-01 08:17:30.0  )
మీ ఫాం హౌస్‌ల చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ ఇలాగే ఉంటుందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ కలాసిగూడ ప్రాంతంలో చిన్నారి మౌనిక మురికి కాలువలో పడి మరణించడం చాలా బాధాకరమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇంటి చుట్టూ, ఫాం హౌస్‌ల చుట్టూ డ్రైనేజీ వ్యవస్థ ఇలాగే ఉంటుందా? అని ప్రశ్నించారు. పేదలు నివసించే ప్రాంతాలంటే ఎందుకింత నిర్లక్ష్యం? అని నిలదీశారు. మరొక ట్వీట్ చేస్తూ.. ‘‘ కేసీఆర్, మీరు పెట్టే పరీక్షలు లీకేజీ, మీరు కట్టిన కాళేశ్వరం ప్యాకేజీ, నీల్లిచ్చే మిషన్ భగీరథ డ్యామేజీ, ఇంకా ప్రారంభం కాని సచివాలయం లీకేజీ’’ అంటూ పేర్కొన్నారు. ఇది సరిపోదా కేసీఆర్ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి అని, ఇంక చాలు గద్దె దిగండని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story