తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: RSP

by GSrikanth |   ( Updated:2022-08-31 02:36:12.0  )
RS Praveen Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. దీనిపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కార్‌, వైద్యారోగ్యశాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఇబ్రహీంపట్నం దవాఖానాలో కుటుంబ నియంత్ర ఆపరేషన్లలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ దుష్టపాలనకు పరాకాష్ట. ప్రజల ప్రాణాలు కాపాడలేని ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలి. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి.'' అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

Advertisement

Next Story