- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సిరిసిల్లను దోచుకున్నది చాలు.. మునుగోడును కూడా వదలరా?'
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని తానే స్వయంగా దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను అని చెప్పిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై BSP తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. దత్తత అంటే ప్రతి గ్రామంలో సిరిసిల్లలోని నేరెళ్ల లాంటి దౌర్జన్య కాండలు సృష్టించడమేనా కేటీఆర్ అని ప్రశ్నించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని మీ దొరలు దోచుకున్నది చాలని మళ్లీ ఇప్పుడు మునుగోడును కూడా దోచుకుంటారా? అని నిలదీశారు. ఎన్నికలప్పుడే ఈ దత్తత డ్రామాలు చేస్తారని ఈ విషయంలో మీ నాన్న మీకు బాగా నేర్పించారని ఎద్దేవా చేశారు.
మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టులు మద్దతు తెలపడంపై ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఏ దోపిడీ దొరలకు వ్యతిరేకంగా ఉద్యమించామో ఇప్పుడు మళ్లీ వాళ్ల గడీలల్లోనే ఏ ముఖం పెట్టుకుని అడుగుపెడతామని నిలదీశారు. కామ్రేడ్స్.. నిజమైన ఎరుపు, ఎన్నటికీ గులాబీ కానేరదంటూ సెటైర్లు వేశారు. మునుగోడు బై ఎలక్షన్‌లో బీఎస్పీ అభ్యర్థికి గౌడ కుల సంఘం ఐక్య వేదిక మద్దతు ప్రకటించడంపై ఆర్ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. ఆధిపత్య దొరలు తమ గడీల నుంచి ఎన్ని ప్రలోభాలు పెట్టిన లొంగక మునుగోడులో బీఎస్పీకి మద్దతు తెలుపుతూ తీర్మానం చేసిన గౌడ ఐక్య వేదిక నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
'కామ్రేడ్స్.. నిజమైన ఎరుపు ఎన్నటికీ గులాబీ కాలేదు'