- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజర్వేషన్లపై అమిత్ షావి అవగాహన లేని మాటలు: RS ప్రవీణ్ కుమార్
దిశ, డైనమిక్ బ్యూరో: రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి అమిత్ షా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రిజర్వేషన్లు మతం పేరిట ఇచ్చినవి కాదని.. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా, పీఎస్ కృష్ణన్ కమిటీ ముస్లిం స్థితిగతులపై పరిశోధన జరిపిన అనంతరం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించిందని గుర్తుచేశారు. సోమవారం లక్డీకాపూల్‌లోని బీఎస్పీ స్టేట్ ఆఫీస్‌లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి మే 7న రాష్ట్ర పర్యటనకు సంబంధించిన కరపత్రం, వాల్ పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి ఆర్ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. 9 ఏళ్లుగా చితికిపోయిన తెలంగాణని రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు రాష్ట్ర ప్రజలందరికీ భరోసా ఇవ్వడానికి సరూర్ నగర్‌లో జరగబోయే బహిరంగ సభకు మాయవతి వస్తున్నారని తెలిపారు.
తాము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర మంత్రివి అవగాహన లేని మాటలని, రిజర్వేషన్ల తొలగింపు ప్రకటనను బీఎస్పీ ఖండిస్తున్నదని తెలిపారు. అమిత్ షా రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అవసరమైతే ముస్లింల రిజర్వేషన్లు పెంచాలని.. తొలగిస్తామని చెప్పడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అమిత్ షా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1994 బీహార్‌లో హత్యకు గురైన తెలంగాణ వ్యక్తి జి.కృష్ణయ్య కేసులో ఆనంద్ మోహన్ దోషిగా జైలులో ఉన్నారని అతడిని బయటకు తీసుకువచ్చేందుకు బిహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.
నితీష్ కుమార్ నిజంగా పేదల సీఎం అయితే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నితీష్ కుమార్‌కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. నిజమైన ప్రజా నాయకులైతే ఈటల, రేవంత్ రెడ్డిలు పేపర్ లీకేజీ, రైతులు, విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడాలని సూచించారు. తెలంగాణలోని 23 వేల ఆర్టిజన్ విద్యుత్ ఉద్యోగులపై ప్రభుత్వం తీవ్ర బలప్రయోగం చేస్తోందని ధ్వజమెత్తారు. ఒప్పంద కార్మికులను ఆర్టిజన్ కార్మికులుగా మార్చి వదిలేశారని వారికి కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు బీఎస్పీ మద్దతిస్తుందని చెప్పారు. ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించడం కాదని ముఖ్యమంత్రిపై ప్రయోగించాలన్నారు.