అమెరికాలో వరంగల్ యువకుడ్ని అభినందించిన R. S. Praveen Kumar

by GSrikanth |   ( Updated:2022-08-19 08:04:29.0  )
అమెరికాలో వరంగల్ యువకుడ్ని అభినందించిన R. S. Praveen Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ నుండి వచ్చిన ఆహ్వానం మేరకు ఆయన యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్న ఆర్ఎస్పీ, అక్కడ సెటిల్ అయిన వరంగల్ యువకుడ్ని అభినందించారు. ''చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా, మొక్కవోని పట్టుదలతో ఫార్మసీలో ఉన్నత శిఖరాలకెదిగిన శాస్త్రవేత్త, వినయ్ ఆరేపల్లిని (వరంగల్) చూస్తే హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఎన్నో కష్టాలు ఉన్నా.. అన్నీ దిగమింగి ఇంతటి స్థాయికి ఎదగడం అభినందనీయం. బీఎస్పీ పాలనలో నిజాయితీగా పనిచేసి ఇలాంటి బెంజీ కార్లలో తిరిగే బిడ్డలను తెలంగాణలో లక్షల్లో తయారు చేస్తం.'' ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

సమాజానికి ఉపయోగపడే విద్యార్థులను తయారుచేస్తా: R S Praveen Kumar

Advertisement

Next Story