- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
52 శాతం బీసీలకు రూ.6,289 కోట్లేనా..? : ఆర్.కృష్ణయ్య
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో 52 శాతం జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.6,225 కోట్లు ఏ మూలకు సరిపోతాయని బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ మెంబర్ ఆర్. కృష్ణయ్య అన్నారు. 202-24 బడ్జెట్‌లో బీసీ సంక్షేమం కోసం నిధులను రూ.20 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులతో గురువారం మంత్రి గంగుల కమలాకర్ చాంబర్‌ను ముట్టడించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో కొత్త స్కీమ్‌లు ఏమీ లేవని, పెరిగిన ధరల ప్రకారం స్కాలర్ షిప్‌లు, మెస్‌ఛార్జీలు పెంచే ప్రస్తావన కూడా లేదన్నారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజు రియంబర్స్‌మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి బడ్జెట్‌లో కేటాయింపులకు పొంతనే లేదన్నారు.
బీసీ కార్పోరేషన్‌లో 12 బీసీ కుల ఫెడరేషన్‌లకు పెండింగ్‌లో ఉన్న 5 లక్షల 47 వేల దరఖాస్తులకు రుణాలు ఇవ్వడానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఏవని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీల సంక్షేమానికి ఏ మూలకు సరిపోదని అందువల్ల బీసీ బడ్జెట్ రివైజ్ చేయాలని డిమాండ్ చేశారు.