Rozgar Mela 2023 : 71వేల మందికి నియామక పత్రాలు అందించనున్న మోడీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-13 03:12:42.0  )
Rozgar Mela 2023 : 71వేల మందికి నియామక పత్రాలు అందించనున్న మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: రోజ్ గార్ మేళాలో భాగంగా 10లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. రోజ్ గార్ మేళాలో భాగంగా నేడు మరో 71 వేల మందికి జాబ్ అపాయింట్ మెంట్ లెటర్లను మోడీ ఇవ్వనున్నారు. అనంతరం కొత్తగా ఉద్యోగాల్లో చేరబోతున్న ఉద్యోగులను ఉద్దేశించి మోడీ ప్రసగించనున్నారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 45 ప్రాంతాల్లో వర్చువల్ గా ఈ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో ఈ మేళా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ హాజరు కానున్నారు. రైల్వేలో ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టికెట్ క్లర్క్ తో పాటు ఎంపికైన వారికి నియామకపత్రాలు అందించనున్నారు.

Advertisement

Next Story