మహిళను కిడ్నాప్ చేసిన దోపిడీ దొంగలు.. కారులోనే గ్యాంగ్ రేప్!

by GSrikanth |   ( Updated:2023-02-19 04:39:33.0  )
మహిళను కిడ్నాప్ చేసిన దోపిడీ దొంగలు.. కారులోనే గ్యాంగ్ రేప్!
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా పీరం చెరువు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వివాహితను కిడ్నాప్‌ చేసి కారులో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తూనే మహిళపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం మహిళ వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకొని వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. అటునుంచి నేరుగా నార్సంగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ వాళ్లకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : 11 మందిని కన్న ఇక ఆపరేషన్ చేసుకుంటానన్న భార్య... వద్దంటూ ఆమెను ఇంటి నుంచి గెంటేసిన భర్త

Advertisement

Next Story