పెరుగుతున్న గోదావరి ఉధృతి.. బోగత జలపాతానికి ప్రమాదకర స్థాయిలో వరద

by Sathputhe Rajesh |
పెరుగుతున్న గోదావరి ఉధృతి.. బోగత జలపాతానికి ప్రమాదకర స్థాయిలో వరద
X

దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో గోదావరి ప్రవాహం పెరిగింది. గత కొద్ది రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతాలో ఎగువన కురుస్తున్నా వర్షాల వలన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. ఆదివారం ఉదయం బ్యారేజ్ వద్ద 81.80 మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తుండగా ఇంకా గోదావరి నీటిమట్టం పెరుగుతూ ఉంది. సమ్మక్క బ్యారేజ్ వద్ద 795700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 59 గేట్లు ఎత్తి 795700 క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నారు.

గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వస్తున్న వర్షాలకు ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు బోగత జలపాతానికి చేరడంతో జలపాతం ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఆదివారం పర్యాటకుల ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తుగా వాజేడు అటవీ శాఖ రేంజర్ మౌలి బోగతలోకి దిగేందుకు అనుమతి లేదని పర్యాటకులు నిబంధనలు పట్టించాలని కోరారు.

శనివారం ములుగు జిల్లాలోని ఆయా మండలాల్లో ములుగు-21.4 మిల్లీమీటర్, వెంకటాపూర్-32 మిల్లీమీటర్, గోవిందరావుపేట-28.6 మిల్లీమీటర్, తడువాయి-29.4 మిల్లీమీటర్, మంగపేట-60 మిల్లీమీటర్, ఏటూరు నాగారం-46.8 మిల్లీమీటర్, కన్నాయిగూడెం-24.2మిల్లీమీటర్, వాజేడు-29.2మిల్లీమీటర్, వెంకటాపురం-75.6 మిల్లీమీటర్ వర్షపాతం నమోదయింది. వరద సహాయార్థం అత్యవసర పరిస్థితుల్లో ఐటిడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్‌ రూమ్‌ సెల్ నెo. 6309842395. 08717-293246 లేదా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 7109 ను అధికారులు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed