రైస్ మిల్లర్లకు ప్రభుత్వ వేధింపులు ఉండవు: ఉత్తమ్

by Ramesh N |
రైస్ మిల్లర్లకు ప్రభుత్వ వేధింపులు ఉండవు: ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైస్ మిల్లర్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండవని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మాదాపూర్ హైటెక్స్‌లో మూకాంబికా రైస్, గ్రెయిన్‌టెక్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ప్రైవేటు, బహుళజాతి కంపెనీల 120 స్టాళ్లు కొలువుదీరాయి. ఈ సందర్భంగా పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రదర్శనకు హాజరై.. కంపెనీల స్టాళ్లను పరిశీలించారు.

అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రైస్ మిల్లింగ్ పరిశ్రమను ముఖ్యమైన రంగంగా గుర్తిస్తామని చెప్పారు. రైస్ మిల్లింగ్ వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తామని అన్నారు. మరోవైపు రైతులు, రైస్ మిల్లర్లకు మేలు జరిగేలా చూస్తామని అన్నారు. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలుకు అందించాలని ఈ సందర్భంగా రైస్ మిల్లర్లకు సూచించారు.

Advertisement

Next Story