స్మితా సబర్వాల్ ట్వీట్‌పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

by Nagaya |   ( Updated:2023-01-22 14:54:35.0  )
స్మితా సబర్వాల్ ట్వీట్‌పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీనియర్​ ఐఏఎస్​అధికారిణి స్మితా సబర్వాల్ ట్వీట్​పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఐఏఎస్​ఆఫీసర్‌కే చిక్కులుంటే సామాన్య మహిళల పరిస్థితేంటో? అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శికే భద్రత లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. తెలంగాణలో మహిళా ఐఏఎస్‌కే రక్షణ లేదని, ఇదేనా తెలంగాణ మోడల్ అని రేవంత్​ ప్రశ్నించారు. డయల్ 100 అని స్మితా సబర్వాల్ అంటుంటే.. కేసీఆర్100 పేపర్ బ్రాందీ అంటున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తెలంగాణలో నియంత పాలన కొనసాగుతున్నదని, జీవో 317తో నష్టపోయిన ఉపాధ్యాయుల అరెస్టులు అక్రమం అని రేవంత్​మీడియాకు ప్రకటించారు. శాంతియుతంగా తమ హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్లలో బందించడం దారుణమన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా టీచర్స్​ దంపతులు విడిపోయే పరిస్థితి ఉన్నదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని, లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామన్నారు.

ఇక ఛత్తీస్ గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి-భద్రాద్రి నిర్మాణంలో కుంభకోణాలు జరిగాయని రేవంత్ ఆరోపించారు. విద్యుత్ సంస్థల పతనానికి కారణం కాబోతున్నాయని కాంగ్రెస్​పార్టీ మొదట్నుంచి చెబుతూనే ఉన్నదని, కానీ సర్కార్​ పట్టించుకోలేదని రేవంత్​చెప్పారు. ఇదే విషయాన్ని సంస్థల సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డిలు కూడా చెప్పినట్లు రేవంత్​గుర్తు చేశారు. ఇప్పటికైనా విద్యుత్ కుంభకోణాలపై కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు.

దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తి చాటింది రాజీవ్​గాంధీ మాత్రమేనని రేవంత్ చెప్పారు. లాల్​బహుదూర్​స్టేడియంలో జరిగిన క్రికెట్​పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్​మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో వీహెచ్​(హనుమంతరావు) సంపాదించింది ఏమీ లేదన్నారు. అందరిలో స్ఫూర్తి నింపడానికి క్రికెట్​పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. ఓటమిని కూడా గెలుపునకు పునాదిగా మార్చుకునే స్ఫూర్తి క్రీడా మైదానంలో ఉంటుందన్నారు. అలాంటి స్ఫూర్తి రాజకీయాల్లోనూ ఉండాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ గుర్తు చేశారు. 21 సంవత్సరాలకు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్​స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed