మన రేవంతన్న.. నిగ్గదీసి అడిగే మొనగాడు.. చిన్నారి పాటకు నెటిజన్లు ఫిదా (వీడియో)

by Ramesh N |   ( Updated:2024-01-29 05:27:27.0  )
మన రేవంతన్న.. నిగ్గదీసి అడిగే మొనగాడు.. చిన్నారి పాటకు నెటిజన్లు ఫిదా (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ వారి సొంత పాటలతో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలు ఇప్పటికీ మనం అక్కడక్కడ పాటలు వింటూనే ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాంగ్ అయిన ‘మూడు రంగుల జెండా పట్టి’ అనే పాట ప్రజల్లోకి ఓ రేంజ్ లో దుసుకెళ్లిపోయింది. ఆ సయమంలో ఎవరినోట చూసిన అదే పాట వినిపించేది. అలా అందరికీ గుర్తుండే పాట ఇప్పటికీ ప్రజల గుర్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల చిన్నారి ఈ పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ‘మన రేవంత్ అన్న.. నిగ్గదీసి అడిగే మొనగాడు’ అంటూ వచ్చి రాని మాటలతో చిన్నారి పాట మొత్తం చక్కగా పాడింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నారి పాటకు నెటిజన్లు ఫిదా అయ్యారు. కాగా, ఎల్‌కేజీ చదువుతున్న విధ్యార్ధిని 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీవీ రామన్ శ్లోక కిడ్స్ ప్లే స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాట పాడి అందరినీ ఆకట్టుకుంటుంది.

Advertisement

Next Story