కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ లాంటోడు: రేవంత్ రెడ్డి

by GSrikanth |
కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ లాంటోడు: రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: “కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ లాంటోడు. మరో మూడు నెలలే గడువు. ముందే పసిగట్టి వింత చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజలకు ఇది అర్థమైంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​విజయం ఖాయం” అంటూ టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో జరిగిన మీడియా చిట్​చాట్‌లో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్​కుటిల రాజకీయం చేస్తున్నాడని ఫైర్​అయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మేలు చేసేందుకే జేడీఎస్‌కు మద్దతు ఇచ్చారన్నారు. కాంగ్రెస్​ఓటు బ్యాంక్​చీల్చి జేడీఎస్‌కు ఎక్కువ సీట్లు సాధించేలా ప్రయత్నం చేస్తే హంగ్ వస్తుందని కేసీఆర్ ప్లాన్ అన్నారు. ఆ తర్వాత బీజేపీకి జేడీఎస్​మద్ధతు ఇవ్వడం వలన బీజేపీని అధికారంలోకి కూర్చోపెట్టొచ్చని కేసీఆర్ ఆలోచన అన్నారు. కాంగ్రెస్​ఓడించడం కోసం ఎంఐఎంను కూడా ప్రచారానికి వెళ్లకుండా కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. భారీ స్థాయిలో కేసీఆర్​డబ్బు ఖర్చుపెట్టాడని రేవంత్ ఆరోపించారు. ఎన్ని కుట్రలకు పాల్పడినా కర్ణాటకలో కాంగ్రెస్‌దే విజయం అన్నారు. ఆ తర్వాత తెలంగాణలోనూ అధికారం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

సమగ్ర సర్వే రాజకీయం కోసమే...

కేసీఆర్​రాజకీయ స్వార్థం కోసమే సమగ్ర సర్వేను బయటపెట్టలేదన్నారు. ఆ రిపోర్టును బట్టి ఎన్నికల వ్యూహాలను అల్లుతున్నాడన్నారు. ఏం చేసినా.. థర్డ్ టైమ్ గెలవడం కేసీఆర్‌కు కలగానే మిగులుతుందన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా హ్యాట్రిక్​సర్కార్​రాలేదని, తెలంగాణలోనూ అదే జరగబోతుందన్నారు. ఈసారి కాంగ్రెస్​పార్టీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. అభ్యర్ధులను కూడా ముందుగానే ప్రకటించే అవకాశం ఉన్నదన్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు లభిస్తాయన్నారు.జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకొని పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారు.

మాస్టర్​ప్లాన్ ఉన్నది...?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిక్లరేషన్, మ్యానిఫెస్టోనూ తప్పకుండా అమలు చేస్తూనే, అభివృద్ధిపై ఫోకస్​పెడతామన్నారు. హైదరాబాద్ డెవలప్ మెంట్‌పై మాస్టర్ ప్లాన్ ఉన్నదన్నారు. మూసీ విస్తరణకు శ్రీకారం చూడతామన్నారు. అక్రమణలు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ల కోసం ప్రత్యేక సిస్టం తీసుకువస్తామన్నారు. విదేశాల తరహాలో మోడ్రన్​కంబైన్డ్ మార్కెట్లను అందుబాటులోకి తెస్తామన్నారు. మూసీ డెవలప్మెంట్‌ను ఎంఎన్​సీ కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహిస్తామన్నారు. దీంతో సర్కార్‌కు వచ్చే ఆదాయాన్ని వివిధ వెల్ఫేర్​స్కీమ్‌లకు ఖర్చు పెడతామన్నారు. బడ్జెట్ అమలులో కేసీఆర్ ప్రాధాన్యత వేరు, కాంగ్రెస్ ప్రాధాన్యత వేరని రేవంత్ అన్నారు.

ఔటర్​ రింగ్​ రోడ్డు.. సోమేష్ కుమార్‌పై ఫిర్యాదు

ఔటర్ రింగ్ రోడ్డు అవినీతిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని రేవంత్ అన్నారు. దీంతో పాటు మాజీ సీఎస్​సోమేష్​ కుమార్‌పై కూడా ఎంక్వైరీ వేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్​చేసిన అవినీతి, అక్రమణలు బయటకు చెబుతాడనే సోమేష్ కుమార్‌కు కొత్త కొలువు పేరిట అడ్వైజర్​ఇచ్చారన్నారు. ఇది రూల్స్‌కు విరుద్ధమన్నారు. కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. ప్రభుత్వ సమయం ఆరు నెలలు ఉంటే.. సోమేష్ కుమార్‌ను మూడేళ్లకు ఎలా? నియమిస్తారని? ప్రశ్నించారు. సలహాదారులకు క్యాబినెట్ హోదా ఇవ్వడానికి అవకాశం లేదన్నారు. 15 శాతం మించి క్యాబినెట్ హోదా ఇవ్వడానికి అవకాశం లేకపోయినా.. కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టమైనోళ్లకు ఆ ర్యాంకు కల్పించినట్లు జీవోలు విడుదల చేయడం దారుణమన్నారు. ఇక కాంగ్రెస్​యూత్​డిక్లరేషన్​విజయవంతమైందని, అదే జోష్‌తో అధికారంలోకి వచ్చేందుకు కష్టపడతామని రేవంత్ నొక్కి చెప్పారు.

Advertisement

Next Story