ఏపీ పాలిటిక్స్‌లోకి రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ.. కీలక జిల్లాలో తొలి బహిరంగ సభ

by Sathputhe Rajesh |
ఏపీ పాలిటిక్స్‌లోకి రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ.. కీలక జిల్లాలో తొలి బహిరంగ సభ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని తానై వ్యవహరించి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించి.. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక, తాజాగా ఏపీ పాలిటిక్స్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనన్నట్లు తెలిసింది. ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నెల 25న తిరుపతిలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలు హాజరుకానున్నారు.

తిరుపతితో పాటు రానున్న రోజుల్లో ఉభయ కృష్ణా, పశ్చిమగోదావరి, కర్నూల్, గుంటూరు జిల్లాలలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల క్యాంపెయిన్ లో రేవంత్ పాల్గొననున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి నడవాలని ఫిక్స్ అయింది. రేవంత్ ఏపీ పాలిటిక్స్‌లో ప్రచారం చేయనుండటం ఖరారు కావడంతో ఈ అంశంపై ప్రత్యర్థి పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఆసక్తిగా మారింది.

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్ధతు ఇవ్వగా రేవంత్ రెడ్డి ఏపీలో జరిగే సభలో పాల్గొననుండటం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఫైర్ బ్రాండ్ నేత పేరు ఖరారు అయిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఏపీలో చంద్రబాబు, రేవంత్ రెడ్డిల ఫొటోలు ఉన్న భారీ కటౌట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్‌ను రేవంత్ రెడ్డి ఏ రేంజ్‌లో విమర్శిస్తారు.. దానికి వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారన్నది పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story