ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత రేవంత్ తొలి ట్వీట్

by GSrikanth |   ( Updated:2023-12-08 13:38:48.0  )
ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత రేవంత్ తొలి ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను సీఎంగా ఎన్నుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావు థాక్రేకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. కాగా, ఇటీవల వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. మ్యాజిక్‌ ఫిగర్‌కు మించి స్థానాలు కట్టబెట్టారు. అనంతరం సుదీర్ఘంగా చర్చలు జరిపిన కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. ఈ నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Next Story