- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర దుమారం.. ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి తలసానిని ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలు తమ జాతిని కించపిరిచేలా ఉన్నాయంటూ యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే రెండు సార్లు డెడ్ లైన్ విధించినా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంపై వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద యాదవ జేఏసీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి గాంధీ భవన్ ముట్టడికి వెళ్లాలని నిర్ణయించింది. దీంతో గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. యాదవ సంఘాల పిలుపు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు డీసీఎంలను అందుబాటులో ఉంచారు. కాగా రేవంత్ రెడ్డి ఎక్కడ యాదవులను కించపరచలేదని మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనకు కౌంటర్ ఇచ్చారని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ రీకౌంటర్ ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి: జగ్గారెడ్డిని ఫాలో అవుతున్న మరో కాంగ్రెస్ ముఖ్య నేత?