పాల్వాయి స్రవంతికి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు :Revanth Reddy

by Mahesh |   ( Updated:2022-09-10 11:13:44.0  )
పాల్వాయి స్రవంతికి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు :Revanth Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనుంది. శుక్రవారం నాడు ఎఐసీసీ ఈ మేరకు పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించింది. దీంతో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్వాయి స్రవంతికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికకు కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ఆమోదం తెలిపారన్నారు. సోదరి పాల్వాయి స్రవంతికి నా శుభాకాంక్షలు. మన ప్రియతమ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ, ఫలితాల వెల్లడి తేదీలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే, ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మునుగోడు కోసం హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే. టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. గులాబీ దళం తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది...

Also Read : రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ : RevanReddy

Advertisement

Next Story