‘కమ్మ’ వర్గానికి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ ఇదే..

by Ramesh N |   ( Updated:2024-06-13 08:20:47.0  )
‘కమ్మ’ వర్గానికి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ ఇదే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ రోజు తెలంగాణ కమ్మ సామాజికవర్గ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారని పేర్కొన్నారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని వెల్లడించారు.

కమ్మ సామాజికవర్గం సమస్యల పరిష్కారం కోసం ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వారు వినతిపత్రం అందజేశారు. కమ్మ సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తూ ట్విట్టర్ వేదికగా గ్రూప్ ఫోటో పంచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed