Revanth Reddy: ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా తెలంగాణ.. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి; సీఎం ట్వీట్

by Ramesh Goud |
Revanth Reddy: ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా తెలంగాణ.. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి; సీఎం ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ఎన్నారైలు తరలిరావాలని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. విదేశాల్లో ఉన్న రేవంత్ రెడ్డి తోలిరోజు పర్యటనలో భాగంగా అమెరికాలోని ఎన్నారైలతో సమావేశం అయ్యి వారికి కీలక సందేశం ఇచ్చారు. ఈ సమావేశానికి సంబందించిన విషయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి పెట్టుబడులతో రమ్మని ప్రవాస తెలంగాణ, తెలుగు ప్రజలకు పిలుపునిచ్చానని, అమెరికాలో నా తొలి రోజు పర్యటనలో భాగంగా ఎన్నారైలతో సమావేశమయ్యానని తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయని, బేగరి కంచె వద్ద నిర్మించబోతున్న నయా నగర నిర్మాణం, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమం పై ఎన్నారైలతో ముచ్చటించినట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన పై విశ్వాసం ఉంచి రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పెట్టిన ప్రతి రూపాయికి ప్రతిఫలం వచ్చేలా ప్రభుత్వ విధానాలు ఉంటాయని, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని, ప్రవాస పెట్టుబడిదారులకు హామీ ఇవ్వడం జరిగిందని ఎక్స్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story