- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Revanth Reddy: ఈగ వాలినా సహించేది లేదు.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: Revanth Reddy Warns To BJP Government Over National Herald Case| నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ సర్కార్ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. హైదరాబాద్ లో టీకాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులతో ఇబ్బందులు పెట్టాలని బీజేపీ సర్కార్ భావిస్తోందని, గాంధీ కుటుంబంపై ఈగ వాలినా సహించేది లేదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో భాగంగానే రాహుల్, సోనియాకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాటంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక పాత్ర కీలకమైనదని చెప్పిన రేవంత్.. దేశ సమగ్రత కోసం పత్రికను మళ్లీ నడపాలని నిర్ణయించారని అన్నారు. పత్రిక నష్టాల్లో ఉంటే కాంగ్రెస్ రూ. 90 కోట్లు ఇచ్చిందని తెలిపారు. 2015లో ముగిసిన విచారణను మోడీ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకురావడం వెనుక కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు. తగిన సమయంలో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని, ఈ నెల 23న సోనియా గాంధీని విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు ఇచ్చిందని, ఆరోజు తమ తడాఖా చూపిస్తామని అన్నారు. దేశంలో మోడీ పతనం ప్రారంభమైందని, మోడీని పాతాళానికి తొక్కితేనే దేశ ప్రజలకు రక్షణ ఉంటుందన్నారు.