కంటతడి పెట్టిన రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

by Satheesh |   ( Updated:2023-04-22 13:47:19.0  )
Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ నుండి 25 కోట్లు డబ్బు తీసుకున్నారంటూ ఈటల చేసిన ఆరోపణలకు భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ నుండి డబ్బు తీసుకున్నారంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంతో తాను ఎన్నడూ లాలూచీ పడలేదని.. కేటీఆర్ ఫామ్ హౌజ్‌లపై ప్రశ్నిస్తే తనను ఎన్నోసార్లు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.

చర్లపల్లి, చంచల్ గూడ జైల్లో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని రేవంత్ భావోద్వేగానికి గురయ్యారు. అలాంటి తనపై బీఆర్ఎస్ నుండి డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ నుండి ఒక్క రూపాయి తీసుకున్న సర్వనాశనమైపోతానని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయే వరకు కేసీఆర్‌తో పోరాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. ఈటల రాజేందర్ ఆలోచించి మాట్లాడాలని.. నోటీసులు రాగానే ఆయన లాగే లొంగిపోయే వ్యక్తిని కాదని ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story