- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS manifesto : బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పై స్పందించిన రేవంత్ రెడ్డి..
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనీఫెస్టోలో అసలేమీ లేదని.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోనే మార్చి.. తిప్పి ప్రకటించారని.. మా గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారని.. కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగానే.. కేసీఆర్ వారి అభ్యర్థులకు బీ-ఫామ్‌లు పంచారు.
అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్ కంటే ముందు ఉంది. మేం 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్ కేవలం 51 మందికే బీ ఫామ్‌లు ఇచ్చారు. దోపిడీ సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని కేసీఆర్ వైఫల్యం చెంది.. చలి జ్వరం తో ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని మరోసారి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచ బోమని బీఆర్ఎస్ చీఫ్ ప్రమాణం చేస్తారా అని.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.